విశాఖ పట్నంలో అలజడి రేపాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను ఖండించారు విశాఖ పోలీసులు. చంద్రబాబు, లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఇద్దరూ ఇరుగుపొరుగువారు మరియు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఇద్దరు కొట్టుకున్నారని తెలిపారు.
వెంటనే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని…వారికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదు.. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు ట్రోలింగ్ జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ ఘటన పూర్తిగా వ్యక్తిగత ద్వేషాలతోనే జరిగింది కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని విశాఖ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఏం జరిగిందంటే..కంచర్లపాలెం పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీనికి రాజకీయ రంగు పులిమి లబ్ది పొందాలని భావించారు టీడీపీ నేతలు.తమ అనుకూల మీడియాలో ఏదో జరిగిపోయిందంటూ ప్రచారం చేశారు. ఇక సోషల్ మీడియా బ్యాచ్ చెప్పనక్కర్లేదు. దీనిని వైరల్ చేయగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు అసలు విషయాన్ని ప్రజల ముందు ఉంచడంతో ఎల్లో బ్యాచ్ దిమ్మతిరిగిపోయింది.