తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ హీస్ట్ గా బిగ్ బాస్ రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడంతో మంచి రేటింగ్ వస్తోంది. ఎన్టీఆర్ వస్తోన్న టైమ్ లో మంచి రెటింగ్ రాగా.. మిగిలన రోజుల్లో పర్వాలేదు అనిపిస్తోంది. అయితే ఈ షోలో కనిపించకుండా ఒకరు వినిపిస్తారనే సంగతి తెలిసిందే. బిగ్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఏం చేయాలో చెపుతుంటారు ఆయన.
ముఖ్యంగా తనదైన గంభీరమైన వాయిస్ తో బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేయడం ఆడియన్స్ ను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఆ ఆదేశాలు ఇస్తుంది ఎవరు? ఆ వాయిస్ ఎవరిది? అనేది తెలుసుకోవాలని ఉందా.. అందుకే ఇప్పుడు ఆ విషయాలు బయటకొచ్చాయి. దానికంటే ముందు హిందీ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో వాయిస్ అతుల్ కపూర్ ది కాగా, ఆయన ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలుసుకోవాలి. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ లో వినిపించే వాయిస్ ఎవరిదనే విషయంకు వస్తే.. ఎక్కువ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ దని తెలుస్తోంది.
ఇక ఆయన ఇప్పటిఇకే చాలా సినిమాలో విలన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు బిగ్ బాస్ కు రాధాకృష్ణతో పాటు మాటీవీలో హిందీ డబ్బింగ్ సీరియల్స్ కు పనిచేసిన శంకర్ కూడా వాయిస్ ఇస్తున్నారని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఈయన సీఐడీ సీరియల్ తెలుగు వెర్షన్ కు ఎక్కువగా పని చేసినట్లు చెబుతున్నారు.