Monday, May 12, 2025
- Advertisement -

‘ప్రత్యేకం’పై బాబు అడుగులెటు…?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపనతో.. ఏపీలో లో కొత్త అధ్యాయం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏడాదిన్నర తర్వాత.. కొత్త రాజధానికి శంకుస్థాపన చేసుకుంది ఆంధ్రప్రదేశ్. భూసేకరణతో 30 వేల ఎకరాలకు పైగా భూమి సేకరణ..

సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సహకారంతో రాజధాని నిర్మాణానికి సంబంధించిన కసరత్తు.. చివరికి అట్టహాసంగా రాజధానికి శంకుస్థాపన వరకు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం పూర్తైంది.

మధ్యలో రైతుల నుంచి అభ్యంతరాలు.. వైసీపీ అధినేత జగన్ దీక్షలు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనలతో కాస్త అయోమయం ఏర్పడినా.. అన్నిటినీ దాటుకుంటూ అనుకున్న పని పూర్తి చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

ఇక్కడి వరకు ఏపీ ప్రజలు సంతృప్తితోనే ఉన్నా… రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అధికార పార్టీ టీడీపీ నేతల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి ఉందన్న విషయం.. ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. శంకుస్థాపనకు వచ్చి.. తన చేతుల్తో కార్యక్రమం నిర్వహించి కూడా… ప్రత్యేక హోదాపై ప్రధాని మాట కూడా మాట్లాడకపోవడం రాజకీయ నాయకులతో పాటు.. ప్రజల్లోనూ తీవ్ర ఆవేదన కలిగించింది. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న ప్రకటన తప్ప.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రత్యేక హోదా ప్రకటనపై మాట కూడా ప్రధాని మాట్లాడకపోవడం.. కేంద్రం ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుకుంటున్నాయి. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని.. ఇప్పటికే చాలాసార్లు కేంద్రం పెద్దలు స్పష్టం చేయడానికి తోడు.. శంకుస్థాపన రోజు ప్రధాని ప్రసంగాన్ని విశ్లేషిస్తున్న నేతలు, పరిశీలకులు.. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కలే అని స్పష్టం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రాన్ని కాదనుకుని ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. లోటు బడ్జెట్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే.. సాధ్యమైనంత వరకూ కేంద్రం నుంచి రాయితీలు, పథకాలు రాబడుతూ ఏపీని దేశంలో టాప్ పొజిషన్ లో నిలబెట్టేందుకు బాబు ట్రై  చేస్తున్నట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఇదే మంచి రూట్ అని బాబు నిర్ణయించుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ అంటున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -