Monday, May 5, 2025
- Advertisement -

ICU లో జయలలిత ఏం చేసేవారు . . లీక్ అయిన సీక్రెట్

- Advertisement -
When Jayalalitha in ICU

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాంతం రాజకీయాలలో ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఆఖరికి తనకి చాలా ఇష్టం అయిన ముఖ్యమంత్రి కుర్చీ లో ఆరు సార్లు గెలిచి కూర్చుని అదే స్థానం లో ముఖ్యమంత్రి గానే కన్ను మూసారు ఆమె.

అనారోగ్యం తో అపోలో లో సరిగ్గా 78 రోజుల క్రితం జాయిన్ అయిన అమ్మ ICU లో ఆరోగ్యం కాస్త సెట్ అయిన తరవాత ఎలా ప్రవర్తించేవారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తునాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్నఅమ్మ.. ఐసీయూలో ఉన్నప్పుడు వైద్యులతో.. నర్సులతో సరదాగా మాట్లాడేవారని.. జోకులు వేసే వారిని చెప్పుకొచ్చారు.‘‘ఆమెలో హాస్య చతురత ఎక్కువ. విపరీతంగా జోకులు వేసేవారు. ఆమె వేసే జోకులకు నర్సులు పెద్దగా నవ్వేసేవారు. ఆమె ఎంతో మంచి సహృదయురాలు’’ అని చెప్పిన మాటలు వింటే విస్మయం చెందాల్సిందే.

ఎందుకంటే.. పలుకే బంగారమా అన్నట్లుగా ఉంటూ.. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆమెలో ఇలాంటి కోణం ఒకటి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసని చెప్పాలి. అమ్మకు వైద్యం చేస్తున్న సమయంలో ఆమెకు వైద్యం చేసిన వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యేవారని.. లక్షలాది మంది ఆకాంక్షను నెరవేర్చాలన్న ఆరాటంతో పని చేసినట్లు ఆమె వెల్లడించారు. జయలలిత లేరన్న విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలోని నర్సులంతా బోరున విలపించారని ఆమె చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో.. తనకు వైద్యం చేస్తున్న వారి పట్ల అమ్మ వ్యవహరించిన తీరు గురించి వింటున్నకొద్దీ ఆమెపై అభిమానం మరింత పెరగటం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -