Friday, May 9, 2025
- Advertisement -

రేణు వెనుక ఉన్నది..వైసీపా..? టీడీపా..?

- Advertisement -

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించే.. ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని.. పవన్ ని.. ఎందుకు ప‌రోక్షంగా టార్గెట్ చేశారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు..? అసలు దీని వెనక ఉన్న అసలు కోణం ఏంటి..? రేణు పరోక్షంగా చేయడానికి కారణం ఏంటి..? ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది.

జగన్ వచ్చే నెలలో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ యాత్ర చేస్తాననని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. జగన్ ప్రారంభించే యాత్రకు పోటిగా పవన్ కళ్యాణ్ కూడా తన యాత్ర చేయబోతున్నాడనే టాక్ కూడా ఇప్పుడు రాష్ట్రా రాజకీయాల్లో వినిపిస్తోంది. పవన్ చేసే యాత్ర వల్ల తన పాదయాత్రకు ఎలాంటి అండంకి కలగకూడదనే ఉద్దేశ్యంతోనే రేణు అస్త్రాన్ని జ‌గ‌న్‌ ఉపయోగించాడన్న అనుమానం.. తెలుగు దేశం పార్టీ వర్గాల్లో ఇప్పుడు కలుగుతోంది.

ఇక పవన్ ప్రస్తుతం దూకుడు పెంచనున్న క్రమంలో ఆయన దూకుడును డిస్టర్బ్ చేసేందుకు తెలుగుదేశం నాయ‌కులే రేణుదేశాయ్‌ని ప్రయోగించారన్నది వైసీపీ నాయకు అనుమానిస్తున్నారు. మరి ఇంతకీ రేణు వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..? రేణు వెనుక ఉన్న పార్టీ ఏది..? అనే కోణంలో రెండు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -