Thursday, May 8, 2025
- Advertisement -

రాహుల్ గాంధీకి చంద్రబాబుపై అంత ప్రేమ ఉందా..?!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రైతు భరోసాయాత్ర నేపథ్యంలో కొత్త కొత్త విశ్లేషణలు.. కొత్త రకం కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ గాంధీ యాత్ర గురించి కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో ఉంటే..

పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన ప్రచారాలు ఊపందుకొంటున్నాయి. రాహుల్ గాంధీకి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై  చాలా ప్రేమ ఉందనేదీ ఈ విషయాల సారాంశం!
మరి రాహుల్ కు ఏమిటి…? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రేమాభిమానాలు ఉండటం ఏమిటి? అంటే.. అవును అని నొక్కివక్కాణిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు. రాహుల్ గాంధీకి చంద్రబాబు అంటే అభిమానం అని..అందుకే ఆయన ఏపీలోని రైతుల పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. తెలంగాణలో రైతులను పరామర్శిస్తాను అంటూ.. రాహుల్ గాంధీ కేసీఆర్ పై విమర్శలు చేయడానికి సిద్ధం అవుతున్నాడని… అయితే ఏపీ రైతుల గురించి మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలంటున్నారు.
ఇది చంద్రబాబుపై రాహుల్ గాంధీకి ఉన్న ప్రేమకు నిదర్శనం అని వారు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని.. దీంతోనే రాహుల్ గాంధీ ఏపీ మీద అసలు దృష్టి పెట్టడం లేదని.. వారు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీపై ఎదురుదాడి చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పనిలో పనిగా.. తెలుగుదేశం ను కూడా భలే ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -