Wednesday, May 22, 2024
- Advertisement -

టిడిపి నేతలతో టచ్ ఉన్న కొడాలి నాని

- Advertisement -

కృష్ణ జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నానితెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్ ఆర్ సిపిలో ఉన్న కొడాలి నాని తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నందమూరి హరికృష్ణ కారులో నాని కూడా ఉన్నారు. దాంతో నాని ఇక తెలుగుదేశంలో చేరిపోయనట్లనని భావించారు. హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య పొరపొచ్చాలున్నా.. ఇద్దరు వీధిన పడేంత వివాదాలు లేవు. వైఎస్ ఆర్ సిపిలో ఉండడం వల్ల లాభం లేదని, ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని వీడుతున్నారని, పార్టీ మారేందుకు ఇదే తనకు సరైన సమయం అని కొడాలి నాని సన్నిహితుల దగ్గర అన్నట్లు సమాచారం. శాసనసభలో మంత్రి అచ్చెంనాయుడిపై చేసిన వ్యాఖ్యలు కూడా నానిని ఇబ్బంది పెడుతున్నాయి.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ లో మంచి జరగాలంటే పార్టీ మారాల్సిందేనన్న అనుచరుల మాటకు ఎంత విలువ ఇస్తారో వేచి చూడాలి. నాని టిడిపిలో చేరేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా.. లేదా అన్నది కూడా ముఖ్యమేనని టిడిపి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -