Monday, May 5, 2025
- Advertisement -

జగన్‌పై దాడి…… గరుడపురాణం శివాజీ, హర్షవర్ధన్ ఎక్కడ?…ఎన్ఐఎ సెర్చింగ్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబు, చినబాబులు అందరూ అది జగన్ అభిమాని పనే అన్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అనుమానాలన్నీ కూడా అధికారపార్టీపైనే ఉంటున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా సానుభూతి కోసం జగనే దాడి చేయించుకుని ఉంటే…..ఆ దాడి ఘటనపై విచారణ జరుగుతూ ఉంటే భయపడాల్సింది జగన్. ప్రోత్సహించాల్సింది చంద్రబాబు. ఎందుకంటే సానుభూతి కోసం జగనే చేయించుకున్నాడని విచారణలో తేలితే ఆ తర్వాత ఇక వైఎస్ జగన్ మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మరు.

నైతికంగా జగన్ పతనమవుతాడు. అలాంటి ఛాన్స్‌ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటాడు? కానీ చంద్రబాబు మాత్రం జగన్‌పై దాడి ఘటన తర్వాత నుంచీ తానే భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఆ భయం కూడా డైరెక్ట్‌గా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. టిడిపి ఎమ్మెల్యే మరణంపై ఎన్ఐఏ విచారణ జరిగితే చంద్రబాబుకు అప్పుుడు ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ అన్న విషయం గుర్తుకురాదు. కానీ వైఎస్ జగన్‌పై హత్యాయత్నాన్ని విచారిస్తామంటే మాత్రం సడన్‌గా ఎన్ఐఏ కేంద్ర విచారణ సంస్థ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మోడీ దాడి అని గగ్గోలు పెడుతూ తన భయాన్ని ప్రజల భయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇక టిడిపి నాయకులు, ఎల్లో మీడియా వ్యవహారశైలి కూడా పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. జగన్‌పై దాడి కేసు విచారణ ఎన్ఐఏ చేపట్టగానే……వైజాగ్ సీపీ సెలవుపై వెళ్లిపోయాడు, సిట్ వారేమో కేసు కి సంబంధించిన డీటైల్స్ ఇవ్వం అంటున్నారు. మేము సహకరించం అని చంద్రబాబు ప్రభుత్వ పోలీసులు చెప్తూ ఉంటారు. తనకు ప్రాణ భయం ఉందని నిందితుడు వాపోతూ ఉన్నాడు. చంద్రబాబేమో మోడీని విమర్శిస్తూ విచారణకు సహకరించకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ యంత్రాంగాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాడు.

జగన్‌పై దాడి కుట్రకు కారణమైన వాళ్ళను పట్టుకోవడానికి విచారణ చేస్తూ ఉంటే చంద్రబాబుకు ఉలుకెందుకు? లోకేష్‌కి తత్తరపాటు ఎందుకు? టిడిపి నేత హర్షవర్థన్ ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేసుకున్నాడు? అందుబాటులో లేకుండా ఎక్కడికిపోయాడు? గరుడ పురాణం శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు? మొత్తంగా చూస్తే చంద్రబాబుతో సహా టిడిపి నేతల భయాందోళనలు, పచ్చ మీడియా వక్రీకరణలు చూస్తూ ఉంటేనే ఈ హత్యాయత్నం వెనకాల ఎవరి హస్తం ఉందో ఇట్టే అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నిజాలు అర్థమవుతూనే ఉన్నాయి. బుకాయింపులతో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు అండ్ కో మాయచేయగలరా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -