ఎన్నికల ముందర ఇచ్చిన ఒక్క హామీని కూడా తీర్చని చంద్రబాబు ని గద్దె దించాలి అంటూ వైకాపా నేత వై ఎస్ జగన్ పిలుపుని ఇస్తున్నారు. ఆయన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అనీ ఈ పోరులో ప్రజల మద్దతు తమకి కావాలి అనీ వైకాపా పార్టీ అధినేత చెబుతున్నారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయడంలేదనీ, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని చంద్రబాబు తన హంగు, ఆర్భాటాలతో మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారాయన.
కాకినాడలో ‘యువగర్జన’లో పాల్గొన్న వైఎస్జగన్, విద్యార్థి లోకం, చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలనీ, ఈ క్రమంలో విద్యార్థులకు వైఎస్సార్సీపీ అండగా వుంటుందని నినదించారు. పట్టిసీమ పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారు అని జగన్ ఆరోపించారు. నిరుద్యోగ బృతి ఇస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఆమాట కూడా ఎత్తకపోవడం దారుణం అన్నారు ఆయన.
” అబద్ధాల చంద్రబాబు మీద రాముడు రావణాసురుడు మీద చేసినట్టు పోరాటం చేస్తున్నాం, విజయం సాధించి తీరతాం ” అంటూ జగన్ ఆవేశంగా మాట్లాడారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. ప్రభుత్వం జనాల కన్నీళ్లు తుడవాలనీ కానీ ఈ ప్రభుత్వం జనాల కన్నీళ్ళని తుడవక పోగా ఇంకా ఎడిపిస్తోంది అని ఆయన ఆరోపించారు.