రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా ఫలితాలకోసం అందిరలోను ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వైసీపీకీ అనుకూలంగా వస్తాయని సర్వేలు స్పస్టం చేశాయి. ఫలితాలకు సమయం ఎక్కువగా ఉండటంతో విజయం మాదంటె మాదే నని వైసీపీ, టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీకీ సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
దేవనాడీ జ్యోతిష్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. అంతేకాదు మే 26 ప్రమాణ స్వీకారానికి శుభదినమని అంటూ ముహూర్తం సైతం పెట్టేశారు ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు మే 26 అనుకూలదినం అంటూ ఆయన ప్రకటించారు.జగన్ జన్మనక్షత్రం రోహిణితోపాటు పార్టీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల మేళవింపుతో ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రెండు నక్షత్రాల బలాల పరిశీలన అనంతరం మే 26న ఉదయం తొమ్మిదిగంటల 20 నిమిషాల సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం శుభ ముహూర్తంగా నాడీ జ్యోతిష్యం చెప్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా వైసీపీకి 107 నుంచి 115 మధ్య సీట్లు రావచ్చని తెలిపారు. ఇకపోతే ఈ ముహూర్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెట్టించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరు అధికారంలోకి వస్తారో ఈనెల 23న తేలనుంది. ఎవరి ఆశలు గల్లంతు అవుతాయే చూడాలి.