Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి??

- Advertisement -
YSR in NTRs Movie

ఎన్టీఆర్ సినిమాలో మరణించిన  వైఎస్ రాజశేఖర్ రెడ్డి నటించడం ఏంటి అని అలోచిస్తున్నారా.. అవును ఇది నిజమే. చరిత్రను మార్చడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి వక్రీకరించవద్దన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి. స్వర్గీయ నందమూరి జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తానని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ సంగతిపై పురందేశ్వరి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమా గురించి నన్ను సంప్రదించలేదు. నాన్నగారికి సంబంధించిన అన్ని విషయాలు బాలకృష్ణకు తెలుసు. ఎన్టీఆర్ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎపిసోడ్ కూడా ఉండాలన్నారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఇప్పుడు ఆ స్ఫూర్తి లేదని, తాను ఎప్పటికీ ఎన్టీఆర్ ఆదర్శలకు కట్టుబడి ఉంటా ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

కొత్త పార్టీ పెడుతున్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ఆమె కొత్తపార్టీ పెట్టడం అంత సులువు కాదు, నాకు ఆ స్థాయి, స్తోమత లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి శత్రుత్వంలేదని, భిన్నాభిప్రాయాలున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనకు తొమ్మిదిన్నర మార్కులు వేస్తానన్న పురంధేశ్వరి.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే ప్రధాని మోదీ పాలనకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనకు మార్కులు వేసే స్థాయి, పరిస్థితి నాకులేదని దాటవేసిన పురంధేశ్వరి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలే మార్కులు వేస్తారని తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -