- Advertisement -
ఏపీ అసెంబ్లీలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ నోటీసు ఇచ్చింది. తమకు సంఖ్యాబలం లేకపోయినా.. ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టేందుకు అవిశ్వాస నోటీసు ఇచ్చామని వైసీపీ నేతలు తెలిపారు. పాలకుల కళ్లు తెరిపించేందుకు.. అవిశ్వాస తీర్మానం ఉపయోగ పడుతుందని వైసీపీ నేతలు తెలిపారు.
అయితే వైసీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసును ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తోసిపుచ్చారు. ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వానికి నిర్ణయాత్మక సలహాలు ఇవ్వకుండా రాజకీయ దురుద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారన్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానంతో ఆ పార్టీ మరింత అభాసుపాలవుతుందని వ్యాఖ్యానించారు.