నంద్యాల ఉపఎన్నిక ఫలితం టీడీపీకి మరణ సంకటంగా మారింది. ఇక్కడి గెలుపోటములే టీడీపీ పాలనకు రెఫరెండమ్‌లాంటిది. వచ్చె ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందనే దానికి ఈ ఎన్నిక నిదర్శనం. గెలిస్తె సమస్య ఉండదు కాని ఓడిపోతె బాబు పతనానికి నాంది కానుంది.
ఇప్పటికే నంద్యాలలో టీడీపీ నుంచి శిల్పాబ్రదర్స్‌తోపాటు ఇతర నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీనుంచి ప్రతిపక్షంలోకి మారడం అనేది సహసంతోకూడిన నిర్నయం. చక్రపాణి పార్టీకి రాజీనామ చేసి వైసీపీలో చేరడంతో ఆయన బాటలో పదుల సంఖ్యలో వెల్లేదుకు నాయకులు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీపై అసంతృప్తితో నాయుకులు ఉన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంటె ఇప్పటికే సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. వారంతా కూడా అదునుకోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా ఇతర పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఫిరాయింపులకు,స్థానిక నాయకులకు పచ్చ గడ్డివేస్తె బగ్గుమంటోంది.
ఫిరాయింపుల మీద ఆగ్రహంతో, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో సుమారు 60 మంది ఎంఎల్ఏలు, నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారంతా చంద్రబాబునాయుడు వైఖరితో మండిపోతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఏం చేయలేక మౌనంగా ఉన్నారు. వారందరూ బహుశా నంద్యాల ఉపఎన్నిక ఫలితం కోసమే ఎదురు చూస్తున్నట్లు కనబడుతోంది. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఓడిపోతే, అసంతృప్తులందరికీ గొంతు విప్పటానికి ధైర్యం వస్తుంది. అప్పుడు మెల్లిగా బయటకువస్తారు.
ఇక్కడ టిడిపి ఓడిపోతే మిగిలిన ఫిరాయింపులకు కూడా ఇబ్బందులు మొదలవుతాయి. దానికితోడు నియోజకవర్గాల పెంపు కూడా లేదన్న విషయం తేలిపోయింది. దానివల్ల వచ్చే సమస్యలేంటో సిఎంకు బాగా తెలుసు. కాబట్టే నంద్యాల గెలుపును చంద్రబాబు అత్యంత ప్రతిష్టగా తీసుకుని పోరాడుతున్నారు.