Sunday, June 16, 2024
- Advertisement -

వైసీపీలో వీరి గెలుపుపైనే అందరి దృష్టి!

- Advertisement -

ఏపీ ఎన్నికల రిజల్ట్స్‌ రాజకీయ పార్టీలకే కాదు కొంతమంది నేతలకు కీలకంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలో మంత్రి పదవులు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ నేతల గెలుపుపై అందరి దృష్టి నెలకొంది.

ఇక ఈ లిస్ట్‌లో తొలిగా వినిపిస్తున్న పేరు రోజా. నగరి నుండి రెండుసార్లు గెలిచిన రోజా ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలకు ముందు సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత వచ్చినా తర్వాత వాటిని అధిగమించి ప్రచారంలో దూసుకెళ్లారు రోజా. మరి ఈసారి ఆమె గెలుస్తుందా లేదా అన్న దానిపై స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది.

జగన్‌పై విమర్శలు చేసే వారిని తనదైన శైలీలో చురకలు అంటిస్తు గుర్తింపు తెచ్చుకున్న నేత అంబటి రాంబాబు. సత్తెనపల్లి నుండి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే గాజువాకలో అమర్‌నాథ్, గుడివాడ నుండి కొడాలి నాని, గన్నవరం నుండి వల్లభనేని వంశీ గెలుపుపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు సార్లు టీడీపీ నుండి గెలిచిన వంశీ ఈసారి వైసీపీ నుండి బరిలో నిలిచారు.

తణుకులో కార్మూరు నాగేశ్వరరావు , గోపాలపురం నుండి హోంమంత్రి తానేటి వనిత , గుంటూరు పశ్చిమలో విడుదల రజనీ పోటీ చేయగా వీరి గెలుపు అవకాశాలు ఏమేరకు ఉన్నాయి అన్నదానిపై అందరి దృష్టి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -