వైసీపీ అధినేత, సీఎం జగన్ రాప్తాడు సభకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే భీమిలి, దెందులూరులో సిద్ధం సభలు సూపర్ హిట్ అయ్యాయి. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలిరాగా జగన్ సభలన్ని జనసంద్రాన్ని తలపించాయి. తాజాగా ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్, అభిమానులు, ప్రజలు తరలిరానున్నారు.
వేదిక ముందు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్ సిద్ధం చేయగా ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
ఈ సభకు దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో 49 స్థానాలు గెలిచింది వైసీపీ. ఇప్పుడు ఆ మూడూ గెలిచి సీమను క్లిన్ స్వీప్ చేసే దిశగా రెడీ అవుతోండగా జగన్ ప్రసంగంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.