Thursday, May 8, 2025
- Advertisement -

ఆనం రాజీనామా….. బాబుపై తీవ్ర విమర్శలు

- Advertisement -

భూమానాగిరెడ్డి మరణం తర్వాత ఆనం వివేకానందరెడ్డి మరణించిన సమయంలో చంద్రబాబుపై అదే స్థాయి విమర్శలు వచ్చాయి. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ, మంత్రి పదవుల్లాంటి ఎన్నో హామీలు ఇచ్చిన బాబు వాళ్ళ క్రేజ్‌ని బాగానే వాడేసుకున్నాడు. అయితే మాట నిలబెట్టుకోవాల్సిన సందర్భం వచ్చేసరికి రుణమాఫీలతో సహా 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినట్టుగానే ఆనం సోదరులను కూడా మోసం చేశాడు. హాస్పిటల్ బెడ్‌పైన చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా ఆనం వివేకానందరెడ్డి ఆ విషయాలే గుర్తుచేసి లోకేష్‌పై, చంద్రబాబుపై ఓ స్థాయిలో కోప్పడ్డాడని ఆనం సన్నిహితులు చెప్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఆనం రామనారాయణరెడ్డి కూడా సోదరుడి బాటలోనే నడిచాడు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ బాబుకు రాజీనామా లేఖ పంపించాడన్న విషయం ఆనం సన్నిహితుల నుంచి తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డిది రాజసంతో కూడిన రాజకీయం అని…….చంద్రబాబువి మాత్రం అన్నీ అధికారం కోసం కాచుక్కూర్చునే గుంటనక్క తెలివితేటలని ఘాటైన విమర్శలతో చంద్రబాబుకు రాజీనామా లేఖ రాశాడట ఆనం. రీసెంట్‌గా విజయసాయితో భేటీ అయిన ఆనం రామనారాయణ రెడ్డి పదవులు, సీట్లు ఏమీ ఆశించడం లేదు…….కానీ చంద్రబాబుపై కసి తీర్చుకోవాలన్న ఆనం వివేకానందరెడ్డి చివరి కోరిక కోసం అయినా సరే వైకాపాలో చేరి టిడిపి ఓటమికి శాయశక్తులా కృషి చేస్తానని మాట ఇచ్చాడట. అధికారంలోకి వచ్చాక చేసిన సాయం వైఎస్‌లు మర్చిపోరని తనకు తెలుసునని……….ఎలా అయినా సరే జగన్‌కి చెప్పి వైకాపాలో చేర్చుకునేలా చేయాలని విజయసాయికి విన్నవించుకున్నాడట ఆనం. రాజీనామా లేఖలోనే తన ఘాటు చూపించిన ఈ ఆనం సోదరుడు ముందు ముందు చంద్రబాబు ఇంకా ఏ స్థాయిలో విరుచుకుపడతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -