Friday, May 9, 2025
- Advertisement -

ఆనం ఎంట్రీకీ రంగం సిద్ధం…?

- Advertisement -

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం 13వ తేదీన జగన్ పాదయాత్ర విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభ వేదికపై జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని రామనారాయణరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

రెండు రోజుల క్రితం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్‌ను కలిశారు. ఆయన కూడా త్వరలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఆయన ఆగస్టు నెలలో వైసీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అయితే ఇటు ఆనం, అటు రామ్ కుమార్ రెడ్డిలు వెంకటగిరి టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.

వెంకటగిరి నియోజవకర్గం టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురు నేతలు పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో జగన్ ఎవరికి హామీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. ముందే ఆనంకు మాట ఇచ్చారని చెబుతున్నారు. ఆనంకు వెంకటగిరి స్థానం కేటాయిస్తే రామ్ కుమార్ రెడ్డికి మరోచోటు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది. అయితే జ‌గ‌న్ వెంట‌గిరి టికెట్ ఎవ‌ర‌కి కేటాయిస్తార‌నేది ఇప్పుడు నెల్లూరు రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -