అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏంమాట్లాడినా సంచలనమే. ఎప్పుడు ఎవర్ని విమర్శిస్తారో పొగుడుతారో ఆయనకే తెలియదు. జగన్ అంటె ఒంటికాలిమీద లేసె జేసీ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను పొగుడుతున్నారో…తిడుతున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాజకీయ పార్టీ నేతగా వైఎస్ జగన్ అభిప్రాయాలను తాను విభేదించినప్పటికీ, జగన్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడేనని, ఆయన కుటుంబం తనకెంతో దగ్గరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ను తాను వాడు, వీడు అని సంబోధిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న పాదయాత్రతో ఆయన బలం పెరిగిందని భావించాల్సిన అవసరం లేదని, రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడుస్తున్నా చూసేందుకు ప్రజలు వస్తారని ఎద్దేవా చేశారు.
అనంతపురంలో తనను అడ్డుకునేందుకు ఎన్నో దుష్ట శక్తులు అడుగడుగునా వెంటాడుతున్నాయని, వాటిల్లో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని, తాను మాత్రం వారి కోరలు పీకేసి తన దారిన తాను వెళుతుంటానని చెప్పారు. ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని తెచ్చుకునేందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రహదారి విస్తరణ పనుల వల్ల ఆయనకు నష్టం జరగదని, ఇంకా చెప్పాలంటే లాభమే కలుగుతుందని అన్నారు.
ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని తెచ్చుకునేందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రహదారి విస్తరణ పనుల వల్ల ఆయనకు నష్టం జరగదని, ఇంకా చెప్పాలంటే లాభమే కలుగుతుందని అన్నారు.