Friday, May 9, 2025
- Advertisement -

జగన్‌కి మైలేజ్ రాకుండా చేయడంలో బాబు సక్సెస్సా…?

- Advertisement -

సేం ఓల్డ్ స్టోరీ. 2014లో రాష్ట్ర విభజన సమయంలో వైఎస్ జగన్ సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం సమైక్యంధ్ర అనలేని దుస్థితి చంద్రబాబుది. ఆయనకు, ఆయన వ్యాపార బృందానికి హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారాల ప్రయోజనాలు ఐదు కోట్ల సీమాంధ్రుల జీవితాలకంటే ఎక్కువయ్యాయి మరి. అందుకే తాను రెండు నాలుకల సిద్ధాంతం వినిపిస్తూ తన మనిషి అయిన అశోక్ బాబును ఆరడుగుల బుల్లెట్‌ని చేసి, కిరణ్ కుమార్‌రెడ్డితో కుమ్మక్కయి పచ్చ మీడియా సాయంతో జగన్‌కి సమైక్యాంధ్ర క్రెడిట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు బాబు. విభజనకు పూర్తిగా సహకరించిన మోడీ పార్టీని సీమాంధ్రులపైన రుద్దడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ పాపంలో పవన్ కూడా భాగం పంచుకున్నాడు. బాబు సేవలో తరించాడు. 2014 నుంచీ ఇప్పటి వరకూ ఎపిని ముంచడంలో సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కూడా బాబువి అవే డ్రామాలు. హోదా పోరాటం క్రెడిట్ జగన్‌కి రాకూడదు. అలా అని చెప్పి ఆ హోదా కోసం బాబు పోరాడడు. తన భజన బృందం అయిన పవన్ కళ్యాణ్, పచ్చ మీడియాలతో షో చేయిస్తూ ఉంటాడు. ఢిల్లీ వేదికగా ప్రత్యక్ష పోరాటానికి దిగిన జగన్‌కి మద్దతు ఇవ్వాల్సింది పోయి జగన్ ప్రయత్నం సీమాంధ్ర ప్రజలకు చేరువకాకుండా చేయడానికి చంద్రబాబు నానా పాట్లూ పడ్డాడు. భజన సేనుడు పవన్ కళ్యాణ్ అయితే కనీసం మద్దతు తెలపలేకపోయాడు. ఇక ఇతర పచ్చ బ్యాచ్ అంతా కూడా వైకాపా పోరాటం జనాలకు రీచ్ అవకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ సజావుగా సాగితే అధికార పార్టీలే ఇబ్బందిపడతాయన్నది నిజం. అందుకే మోడీకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా నీరవ్ మోడీ లాంటి ఇష్యూలు వచ్చి మోడీ ఇబ్బందిపడకుండా పార్లమెంట్‌ని మాత్రం సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంటోంది బాబు బృందం. మళ్ళీ మోడీ మాట్లాడే సమయం వచ్చేసరికి పూర్తిగా సైలెంట్ అయి మోడీకి మద్దతు తెలుపుతారనడంలో సందేహం లేదు. ఇంతకుముందు సమావేశాల్లో కూడా టిడిపి చేసింది అదే కదా.

రాష్ట్రంలో కాదు దమ్ముంటే ఢిల్లీలో పోరాడమని జగన్‌కి సవాల్ విసిరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఇళ్ళ ముందు వైకాపా ఎంపీలు, శ్రేణులు ధర్నా చేస్తూ ఉంటే మాత్రం…….అరెస్టులకు వెరవక పోరాడుతూ ఉంటే మాత్రం ఆ పోరాటం ఫెయిలయింది అని ప్రచారం చేయడంలో గొప్ప పాత్ర పోషించారు బాబు అండ్ కో. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, పోలవరం అన్నవి చంద్రబాబు లక్ష్యాలే కాదని ఇందుకే విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ప్యాకేజ్ నిధులు, రాజధాని నిర్మాణ నిధులు, పోలవరం నిధులను కేంద్రం బాబు చేతికి ఇస్తూ ఉండాలి. ఎలా ఖర్చుపెట్టావని అడగకూడదు. ఇష్టారీతిన పచ్చ చొక్కాలకు పంచిపెట్టినా ఎవరూ ప్రశ్నించకూడదు. దేశంలోనే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినా బాబు నిప్పు అని మాత్రం భజన చేస్తూ ఉండాలి.

గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి హోదా పోరాట వేదిక మారినా ఏముంది? జగన్ పోరాటాలన్నీ ఫెయిల్ అని ప్రచారం చేయిస్తూ ఉంటాడు చంద్రబాబు. తాను మాత్రం పోరాటం అని చెప్పి మీడియాకు లీకులిస్తూ తన స్వార్థ ప్రయోజనాలు తాను చూసుకుంటూ ఉంటాడు. చంద్రబాబు వందిమాగదులంతా బాబుపై ఈగ వాలకుండా చేస్తూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని లౌక్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక పవన్ లాంటి డైరెక్ట్ భజనసేనులు, రాధాకృష్ణలాంటి వాళ్ళు అయితే డైరెక్ట్‌గానే పాపం అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్‌దే అని ప్రకటనలు ఇస్తూ ఉంటారు కామెడీగా. చివరికి బాబు రాజకీయ స్వార్థం కోసం పూర్తిగా నష్టపోయేది మాత్రం 2014 విభజన సమయంలోలాగే ఇప్పుడు కూడా సీమాంధ్ర ప్రజలే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -