Friday, May 9, 2025
- Advertisement -

నిప్పు, పప్పు, పార్ట‌న‌ర్ ప‌వ‌న్‌పై విజ‌య‌సాయి అదిరిపోయే సెటైర్లు..

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబుపై మాట‌లు తూటాలు పేలుస్తుంటె…ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో విరుచుకు ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజులుగా విజ‌య‌సాయి ట్విట్ట‌ర్‌లో బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా బాబు, లోకేష్‌, ప‌వ‌న్‌ల‌పై ట్విట్ట‌ర్‌లో నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఎన్సీ నేత ఫరూఖ్ అబ్ధుల్లా గెలుపు అవకాశాలు కనిపించడం లేదని చంద్రబాబుకు ముఖం మీద చెప్పారట కదా అంటూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతోందని తెలుగు తమ్ముళ్లు కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారని, తాజాగా ఫరూక్‌ కూడా మీ ఓటమి ఖాయం చేసేసారని ఎద్దేవా చేశారు. ప్రజా స్పందన లేకపోవడం, జనాలు పల్చగా ఉండటం గమనించిన అబ్దుల్లా… ఐదేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు ఏంచేశార‌ని మంద‌లించార‌ని వ్యంగ్య‌స్త్రాలు సంధించారు.

నారాలోకేష్ ప్ర‌చార‌నికి వెల్తుంటె తెలుగు త‌మ్ముళ్లు బెంబెలెత్తిపోతున్నారంట‌. చిన‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లను చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు. మీ దెబ్బకు ప్రచారం వదిలి జన సమీకరణ చేయాల్సి వస్తోంది’ అని తెలుగుదేశం అభ్యర్థులు వాపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. చిన బాబు ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక ఆయ‌న్ను మంగళగిరిలోనే ఉంటే మంచిదని తెలుగు త‌మ్ముళ్లు చెప్పారంట క‌దూ అంటూ విజ‌య‌సాయి సెటైర్లు వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -