మంత్రి నారాలోకేష్ బ్లండర్ మిస్టేక్ చేసి మరో సారి నెటిజన్లకు దొరికిపోయారు. ఎన్నికల అఫిడవిట్ లో భర్త పేరు అని ఉన్న స్థానంలో తన తండ్రి పేరు రాశారు. కాగా.. అది తీవ్ర వైరల్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే… అదే తప్పు చంద్రబాబు కూడా చేయడం. చంద్రబాబు కూడా భర్త పేరు అని రాసి ఉన్న చోట ఆయన తండ్రి పేరు రాశారు. అసలు ఇద్దరిలో ఎవరు ఎవరిని చూసి కాపీ కొట్టారో గాని ఇప్పుడది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజాపా అధ్యక్షుడు కన్నా ఘాటుగా సెటైర్లు వేశారు.
బాబు లీకేష్, “ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?” అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం.. కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని కేఏ పాల్ కబుర్ల చెబుతారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, లోకేష్ అఫిడవిట్ లకు సంబంధించిన ఫోటోలను కూడా కన్నా తన ట్విట్టర్ లో పెట్టడం విశేషం.