Thursday, May 8, 2025
- Advertisement -

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌2కు సిద్ధ‌మైన చంద్ర‌బాబు..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ త‌న రాజ‌కీయానికి ప‌దును పెడుతున్నారు చంద్ర‌బాబు. రాజ‌ధాని నిర్మానం, పోల‌వ‌రం, మైనింగ్ మాఫియాతో బాబు గ్రాఫ్ ప‌డిపోయింది. ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌తీసి మ‌ల్లీ త‌న గ్రాఫ్‌ను పెంచుకొనేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఆప‌రేషన్ ఆక‌ర్ష్‌తో పేరుతో వైసీపీనీ దెబ్బ కొట్టిన బాబు ఇప్పుడు ఆప‌రేషన్ ఆక‌ర్స్ 2కు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఏజిల్లాలో పార్టీ బ‌ల‌హీనంగా ఉందో అక్క‌డ వేరే పార్టీ అభ్య‌ర్తుల‌ను పార్టీలోకి చేర్చుకొనేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎవ‌రిని చేర్చుకోవ‌ల‌నే దానిపై బాబు లిస్ట్‌ను త‌యారు చేశారు. వారితో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు మంత్రుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో ఎక్కువ‌గా కాంగ్రెస్ వారే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇప్పుడు ప్ర‌భుత్వంపై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఎక్కువ‌గా త‌న సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ఫోక‌స్ పెట్టారు. దీంతో టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కోంటోంది. పార్టీనీ నిలుపుకొనేదానికి చంద్ర‌బాబు స్కెచ్ వేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇత‌ర పార్టీల్లోని సీనియ‌ర్ల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. జాబితాలో శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళి, విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రి, కొణ‌తాల రామకృష్ణ ఉన్న‌ట్లు స‌మాచారం. స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను కూడా పార్టీలో చేర్చుకుని, రాజ‌మండ్రి ఎంపీ, లేదా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు బాబు సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చంద్రబాబుతో భేటీ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక క‌డ‌ప జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకోవాల‌ని బాబు భావిస్తున్నారంట‌.

విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని తీసుకునేందుకు బాబు సానుకూలంగా ఉండ‌గా.. డిప్యూటీ సీఎం కేఈ క‌`ష్ణ‌మూర్తి వ్యతిరేకిస్తున్న‌ట్లు సమాచారం. అనంత జిల్లా నుంచి మాజీ మంత్రి శైలజా నాథ్ పేరు వినిపిస్తోంది. శైల‌జానాథ్‌కు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో సీఎం చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న తీరుపై అటు ప్ర‌జ‌ల్లో, ఇటు పార్టీ క్యాడ‌ర్‌లో కొంత అసంత‌`ప్తి ఉంది. హోదా విష‌యంలో ఆయ‌న కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఎంత‌మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -