Friday, May 9, 2025
- Advertisement -

అథోగతిపాలయ్యే దిశగా ఆంధ్రప్రదేశ్ః నాలుగేళ్ళ తన పాలన తర్వాత బాబు ఒప్పుకున్న నిజం

- Advertisement -

నరేంద్రమోడీతో కలవడానికి మూడు రోజుల ముందు ఇదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం కంటే ఎక్కువగా అభివృద్ధి సాధిస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానంత స్థాయిలో పరిశ్రమలు వచ్చాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. చినబాబు లోకేష్ కూడా అవే మాటలను రిపీట్ చేశాడు. కాస్త కళ్ళు తెరిచి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని…….. కళ్ళులేని కబోదుల్లా వ్యవహరిస్తే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని ప్రతిపక్ష వైకాపాను ఎద్దేవా చేశారు కూడా.

అదే చంద్రబాబు నరేంద్రమోడీని కలిసి బయటికి వచ్చాక పూర్తిగా రివర్స్‌లో మాట్లాడారు. పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపరిస్థితి గురించి వైఎస్ జగన్ ఏకరువు పెడుతున్న మాటలన్నీ చంద్రబాబు నోటి నుంచి వినిపించాయి. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజ్ కింద నిధులు కూడా రావడం లేదు, రాజధాని నిర్మాణ నిధుల విషయంలో అతీ గతి లేదు, రైల్వేజోన్‌కి పంగనామం, పోలవరం కూడా పూర్తయ్యే అవకాశం లేదు, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం……. ఇదీ చంద్రబాబు మాటలు సాగినతీరు. అన్నీ కూడా జగన్ చెప్తూ వస్తున్న మాటలే. అధికారంలోకి వచ్చి నాలుగో ఏడాది కూడా పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్లడించిన బీద అరుపులే. అంటే నాలుగేళ్ళ కాలంలో చంద్రబాబు ఏం చేసినట్టు? ఏమీ చేయదని చంద్రబాబే ఒప్పుకున్నట్టా? సందేహం ఏముంది? మోడీని కలిసి బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు మాటలన్నింటినీ శ్రద్ధగా ఉంటే అర్థమయ్యే విషయం ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అథోగతి పాలయ్యే దిశగా సాగుతోందని….. దాదాపు నాలుగేళ్ళ పాలనా కాలం పూర్తి చేసుకోబోతున్న అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని ఆ విధంగా తిరోగమన దిశగా ముందుకు నడిపించాడని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -