అవినీతి కేసుల్లో చిక్కుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బాబు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 19న(రేపు) విచారణకు రానుండగా ఆయనకు బెయిల్ వస్తుందా అంటే సందేహమే. ఎందుకంటే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో పాటు మరిన్ని కేసుల్లో సీఐడీ బాబును చేర్చడంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అడ్వకేట్ వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 నెలల పాటు బాబుకు బెయిల్ రావడం కష్టమేనని న్యాయవాదులు చెబుతున్న పరిస్థితి.
ఇక బాబును జైలు నుండి బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ పలుకుబడిని అంతా ఉపయోగిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు భువనేశ్వరి, బ్రాహ్మాణి ప్రయత్నిస్తున్నారు.
బాబు అరెస్ట్ తో ఆయనపై కాస్త సింపతీ ఉన్నా అది ఓటింగ్‌గా ఎంతవరకు మారుతుందనేది ప్రశ్నార్థాకమే. ఎందుకంటే అవతలి వైపు ఉంది జగన్. బాబు అరెస్ట్ సింపతిని తనకు మైనస్ కాకుండా ఎలా చేసుకోవాలో జగన్‌కు తెలుసని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా గతంలో అనేకసార్లు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. బాబే ప్రధాన కుట్రదారని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగింది సీఐడీ. దీంతో బాబు వయస్సు దృష్ట్యా ఆయనపై సానుభూతి ఉన్న అది వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. బాబు అవినీతిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు జగన్. ఇప్పటికే వైసీపీ నేతలు ఆపనిలో నిమగ్నమై సక్సెస్ కూడా సాధించారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజల్లో తీవ్ర నిరసన వస్తుందని టీడీపీ నేతలు భావించారు కానీ అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తంగా బాబు అరెస్ట్ సానుభూతి ఓటింగ్‌గా మారుతుందా అంటే సందేహమనే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.