Saturday, May 10, 2025
- Advertisement -

కాంగ్రెస్‌, టీడీపీ పొత్తును చీద‌రించుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు…

- Advertisement -

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో మ‌హ‌త్త‌ర ఘ‌ట్టం చోటుచేసుకుంది. రెండు బ‌ద్ద‌శ‌త్రు పార్టీలు ఒక‌టై చెట్టప‌ట్టాలేసుకున్నాయి. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కాపాడాటానికి ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపిస్తే అల్లుడు …చంద్ర‌బాబు అదే పార్టీ ద‌గ్గ‌ర ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టారు.రాహుల్‌, సోనియా, కాంగ్రెష్ పార్టీనీ తిట్టిన బాబు ఇప్పుడు వాల్ల కాల్ల ద‌గ్గ‌రికే చేరారు.

అయితే కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపై రాష్ట్ర‌నేత‌లు మాత్రం గుర్రుగా ఉన్నారు. ఇన్నాల్లు టీడీపీకి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌కు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ… జాతీయస్థాయిలోనూ ఆ పార్టీతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంది.

రాహుల్ తో చంద్రబాబు భేటీ దేశ రాజకీయాల్లో కొత్త అంకానికి తెరలేపుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే..కాంగ్రెస్ నేత‌లు మాత్రం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ఏ మాత్రం పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు ఏపీ కాంగ్రెస్ కీలక నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పల్లంరాజు, ఎంపీ కేవీపీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి వాళ్లు చంద్రబాబుతో రాహుల్ గాంధీ భేటీకి దూరంగా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌తో, టీడీపీ పొత్తుపై ఎవ‌రూ స్పందించ‌లేదు.

చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం పట్ల ఏపీ కాంగ్రెస్ నేతలు అంత సుముఖంగా లేరేమో అనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నా… ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు పట్ల సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలు లేవనే చెప్పాలి. కాంగ్రెస్ నేత‌లు ఎలా స్పందింస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -