Wednesday, April 24, 2024
- Advertisement -

నీతులు చెప్పే వర్ల రామయ్య …అవి నీకు వర్తించవా..?

- Advertisement -

నిద్రలేచినప్పటినుంచి బాబు మెప్పుకోసం సీఎం జగన్ పై అనుచితి వ్యాఖ్యలు చేసె వారిలో వర్లారామయ్య ముందుంటారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడే ఈయన టీడీపీ అధికారం కోల్పోయిన ఇంకా ఆర్టీసీ ఛైర్మెన్ పదవకి రాజీనామా చేయకుండా దాన్పని ట్టుకొనే వేలాడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు మారితే నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేయడం సహజం.

వాస్తవానికి ఆర్టీసీ చైర్మన్ పదవీకాలమే ఏడాది అట. ఆ లెక్కన కూడా ఈయన పదవీకాలం ముగిసిపోయింది. కాని వర్లారామయ్య మాత్రం అందుకు విరుద్ధంగా ఇంకా పదవిని పట్టుకొనే వేలాడుతున్నారు.తన హోదాకు, జీతభత్యాలకూ ఆ పదవిని వాడుకొంటూ.. ఈయన చలామణి అయిపోతున్నారు. గతంలోనె నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కాని వర్లా రామయ్య ఇంకా ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని పట్టుకొని కొనసాగుతున్నారు.

తాజాగా మరో సారి వర్లారామయ్యకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఛైర్మెన్ పదవికి రాజీనామా చేయాలని నోటీసులు ఇచ్చింది. కనైనా గౌరవంగా తప్పుకోవాలని, లేకపోతే తప్పించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది.ఎన్నో నీతులు చెప్పే వర్ల రామయ్య ఈ పదవిని పట్టుకుని ఇంకా వేలాడుతూ ఉండటం చూస్తె మెడ పట్టుకొని బయటకు గెంటించేంత వరకు తెచ్చుకుంటారా లేకా గౌరవంగా తప్పుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -