Wednesday, May 7, 2025
- Advertisement -

మారకపోతే రాష్ట్రపతి పాలనే: బీజేపీ ఎంపీ హెచ్చరిక

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు మారకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన తప్పదని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. దళారీలకు సీఎం కేసీఆర్ చీఫ్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్ ను త్వరలో బట్టలూడదీసి కొడ్తారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్దంగా ఉన్నానన్నారు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందన్న ఆయన దుబ్బాక ఎన్నికతో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీజేపీదేనని అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.

దర్నా చౌక్ ఎత్తేసినోళ్ళకి దర్నాలు చేసే హక్కులేదని విమర్శించారు. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేసారు. సన్నాలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ‘దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడు? కవిత, హరీష్ రావులు ర్పోరేట్ కాళాశాలల్లోనే తమ పెట్టుబడులు ఎందుకు పెడ్తున్నారు ? సాయంత్రమైతే కేటీఆర్ కార్పోరేట్ తరహా పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు? అని ఆయన ప్రశ్నించారు.

కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవటం వలనే ఎమ్మెల్యే, మంత్రులు భూనులు కబ్జాలు చేస్తున్నారన్న ఆయన కేసీఆర్ రైతు నిర్వచనాన్నే మార్చివేశారు‌‌ని అన్నారు. దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని.‌‌‌‌. పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పండుతోన్న పసుపును కాదని కమిషన్ కోసమే ప్రభుత్వం పసుపును దిగుమతి చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. వేల కోట్ల కమిషన్లు పోతున్నాయనే రైతు చట్టంపై ప్రాంతీయ పార్టీల అపోహలు సృష్టించాయని అరవింద్‌ ఆరోపించారు.

Also Read: కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -