Wednesday, May 7, 2025
- Advertisement -

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే…

- Advertisement -

వైసీపీలోకి వ‌ల‌స‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయే త‌ప్ప ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు… ఈ యాత్రకు వస్తున్న ప్రజలను చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి, నాయకులు వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు…ఇప్పటికే అన్ని పార్టీల నుండి అనేక మంది నాయకులు పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

తాజాగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్‌ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -