అధికారంలో ఉన్న పార్టీ ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తుందా? లేకపోతే ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందా? అన్న విషయం తెలుసుకోవడానికి ప్రాతిపదికగా తీసుకునే విషయాల్లో బ్యూరోక్రాట్స్‌కి సంబంధించిన విషయం ఒకటి. సాధారణంగా మన దగ్గర అధికారంలో ఉన్న పార్టీకి సరెండర్ అయి ఉండే ఉద్యోగులే ఎక్కువ మంది ఉంటారు. ఐఎఎస్‌ల పరిస్థితి కూడా అయ్యా……ఎస్ అనేలా ఉందని చాలా మంది సీనియర్ ఐఎఎస్ అధికారులు పుస్తకాలు కూడా రాశారు. అందుకే అధికార వ్యవస్థలో ఉన్న వాళ్ళు పొలిటికల్ ట్రెండ్స్‌ని కూడా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటి అధికారుల మూమంట్స్‌ని స్టడీ చేసినా కూడా తర్వాత ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే అధికారం నిలబెట్టుకుంటుందా? లేక ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న విషయాన్ని కొంతవరకూ ఊహించవచ్చు.
వైఎస్ పాదయాత్ర ముగింపుకు వచ్చేసరికి అధికార వ్యవస్థలో ఉన్న చాలా మంది సీనియర్స్ చంద్రబాబుకు దూరం జరిగారు. వైఎస్‌కి సపోర్ట్ ఇవ్వడానికి ఉత్సుకత చూపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో అలానే జరుగుతోందని తెలుస్తోంది. చంద్రబాబు అవినీతిని భరించలేక చాలా మంది ఐఎఎస్ అధికారులు ఇప్పటికీ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టిడిపి నేతల ఆగడాలతో ఇబ్బందిపడిన కొందరు ఇప్పుడు పూర్తిగా జగన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఎంపిల, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డికి సాక్ష్యాధారాలు అందించింది కూడా వాళ్ళే అని తెలుస్తోంది. ఇక రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా రాజీనామాలు చేసి మరీ జగన్ పార్టీలో చేరుతూ ఉండడం గమనార్హం. తాజాగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ని కలిసిన డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసిన తలారి రంగయ్య జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. తన పదవికి స్వచ్ఛంధ పదవీ విరమణ ప్రకటించి మరీ ఈయన వైకాపాలో చేరారు. త్వరలో మరికొంతమంది బ్యారోక్రాట్స్ కూడా జగన్‌కి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సర్వేలు, పాదయాత్ర తర్వాత నుంచీ జగన్‌కి వస్తున్న స్పందన, పొలిటికల్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే మాత్రం 2019లో అధికారంలోకి రావడానికి అవసరమైన అడ్వాంటేజ్ మాత్రం జగన్‌కి రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది.