ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.గత కొన్ని రోజులుగా పిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్,కరనం బలరాంమధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమంటోంది.ముందొచ్చిన చెవులు కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు చంద్రబాబు కరనం బలరాంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
గతకొంతకాలంగా కరనం,బలరాంల మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది.కనిగిరిలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో గొట్టిపాటి రవికుమార్ చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ..పార్టీలో ఉండాలో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన చంద్రబాబు అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు.
సీఎం క్యాంపు ఆఫీస్‌లో గురువారం జరిగిన సమన్వయ కమిటీ భేటీలో ప్రధానంగా వీరిపైనే చర్చ కొనసాగింది. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే వినాలన్నారు. కానీ ఇప్పుడు పార్టీని బజారుకు ఈడ్చేందుకు ప్రయత్నిస్తే కరణం బలరాం అయినా సరే తాను ఉపేక్షించబోనని బాబు వ్యాఖ్యానించారు.ఇప్పుడు కరనం చూపు ఎటువైపనే ఉహాగాలు వినిపిస్తున్నాయి.ఒక వేల పార్టీని వీడాల్సి వస్తె వైసీపీ ప్రత్యామ్నాయం కాబట్టి…ఆపార్టీలోకి వచ్చే అవకాశాలు లేకోలేదనె చెప్పాలి.