రాష్ట్రంలో టీడీపీ ఎంత బలంగా ఉండేదో అందరికి తెలుసు.. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి టీడీపీ ని ఎంతో బలంగా ఉంచడంలో చంద్రబాబు సఫలమయ్యారు.. అయితే ఇప్పుడు అయన తనయుడు జగన్ ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు ఎందుకు టీడీపీ ని బలంగా ఉంచలేకపోతున్నారో అర్థం కావట్లేదు.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండడం ఇప్పుడు కొత్తేమి కాదు ఎందుకంటే కాంగ్రెస్ గెలిచినప్పుడు అయన ప్రతిపక్షంలో కూర్చున్నవాడే.. కానీ అప్పటిలా ఇప్పుడు ఆత్మవిశ్వాసం తో అయన ముందుకు వెళ్లలేకపోతున్నాడు..
గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయనపై ప్రచారం ఇప్పుడు కొనసాగిస్తుంది.. దానికి తోడు ఈ సోషల్ మీడియా ఆయనకు శాపంగా మారింది.. ఏమీడియా నైతే అడ్డం పెట్టుకుని ఎంత ఎత్తుకు ఎదిగారు అదే మీడియా సాక్షిగా బాబు రోజు రోజు కి దిగజారిపోతున్నాడు.. అసలు విషయం ఎలా ఉందంటే అయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన బ్యాడ్ నేమ్ కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వచ్చిన బ్యాడ్ నేమే ఎక్కువ అనిపిస్తుంది.. అయితే తన కన్నా చిన్న వాడైనా జగన్ చేతిలో అంత దారుణంగా ఓడిపోయి ఇలా దిగజారిపోతుండడంతో అయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదట..
అధికారం చేజారినా చంద్రబాబు నాయుడి తీరు మారలేదు.. అనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లోకి చొచ్చుకుపోతోంది. చంద్రబాబుకు కుటిల రాజకీయ నేతగా పేరు లేకపోలేదు. ఆ కుటిల రాజకీయాన్ని ఇప్పుడు ఆయన ప్రయోగిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా చొచ్చుకుపోతున్నాయి. తాజాగా కోర్టుల్లో తమకు అనుకూల తీర్పులు వస్తున్నాయనే ఉత్సాహంలో తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో మీద కూడా కోర్టుకు ఎక్కింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో ఉండకూడదంటూ ఆక్షేపిస్తోంది టీడీపీ. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకపోయినా.. సుప్రీంకు వెళ్లమని సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతోనే చనిపోయిన వారిని కూడా వదలవా అని జనాలు తిడుతున్నారు.. వైసీపీ ఎప్పుడు ఎన్టీఆర్ ఫోటో ని వాడొద్దని చెప్పలేదు అని అంటున్నారు.. దీంతో చంద్రబాబు కోరి కొరివి తెచ్చుకుంటున్నారని అర్థం అవుతుంది..