ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు అనుకూలంగా వస్తుండంతో ఆపార్టీలోకి వలస వెల్లేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీ లోకి వెల్లడమే కాకుండా సినీ ప్రముఖులు కూడా పార్టీకండువా కప్పుకొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది సినీ నటులు పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా కమెడియన్ అలీ వైసీపీలో చేరనున్నారు.
టీడీపీలో అనేక సంవత్సరాలుగా పనిచేసినా ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఓపెన్‌గా చెప్పాశారు అలీ. పాదయాత్రలో జగన్‌తో భేటీ అయినప్పుడే అలీ వైసీపీలో చేరుతున్నారనె వార్తలు హల్ చల్ చేశాయి. ఆ తర్వాత టీడీపీ అధినేత బాబుతో, జనసేన అధినేత పవన్‌తో చర్చలు జరిపారు. తన డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో న్యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపద్యంలో ఆలస్యం చేస్తె పమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో లేట్ చేయకుండా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వైసీపీ నేతలతో అలీ మంతనాలు జరిపినట్లు సమాచారం. కాసేపట్లో వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు. అనంతరం పార్టీ కండువా కప్పుకోనున్నారు.