వలసలతో వైసీపీ బలోపేతం అవుతోంది. ఒక వైపు జగన్ ఎన్నికల ప్రచారం…మరో వైపు పార్టీలోకి ఇతర పార్టీల సీనియర్ నేతలు పార్టీలోకి వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఇతర పార్టీల నేతలు, మాజీ మంత్రులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో సీనియర్‌నేత పార్టీలో అడుగుపెడ్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టు నేపథ్యంలో హస్తంపార్టీలో మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన ఉన్న సీనియర్ నేత అయిన వట్టి వసంత కుమార్ ఇటీవలే పార్టీకీ రాజీనామా చేశారు. వచ్చే నెలలో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 3వ తేదీన ఎం.ఎం.పురంలో తన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో చర్చించి.. ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. టీడీపీ ని ఎదుర్కోవాలంటే.. వైసీపీనే తనకు కరెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి సి. రామచంద్రయ్య కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే మరో వైపు జనసేనలోకి వెల్లాలని కొందరు అభిమానులు, అనుచరులు మాత్రంలో జనసేనలో చేరాలని ఒత్తిడి తెలస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ టికెట్ ఆశిస్తున్నారు.ఈ నేపథ్యంలో నరసాపురం లోక్ సభ స్థానం టికెట్ ఏ పార్టీ ఇవ్వడానికి అంగీకరిస్తే.. ఆ పార్టీలోకి జంప్ అవ్వాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం.