Saturday, May 10, 2025
- Advertisement -

కృష్ణ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి పెరుగుతున్న బలం

- Advertisement -

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది వైసీపీకి బ‌లం పెరుగుతోంద‌నే చెప్పాలి. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జా స్ప‌ద‌న‌ను చూసి ఇత‌ర పార్టీలలోని సీనియ‌ర్ నేత‌లు వైసీపీవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు కనుమూరి బాపిరాజు పార్టీలో చేరేదానికి రంగం సిద్ద‌మ‌య్యింద‌నే చెప్పాలి.

పాద‌యాత్ర‌లో కొన్ని చోట్ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్నారు. కనుమూరి బాపిరాజు పార్టీలో చేరితే కృష్ణా, గోదావరి జిల్లాల్లో బాగా పట్టున్న బాపిరాజు వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి ఊపు రావటం ఖాయమని నేతలు భావిస్తున్నారు. అందుకని ఎలాగైనా బాపిరాజు వైసిపిలో చేరేట్లుగా ప్రయత్నాలు ముమ్మ‌రం చేశార‌ట‌.

కాంగ్రెస్ లోనే కొనసాగితే భవిష్యత్ ఉండదన్న విషయం బాపిరాజుకు కూడా బాగా అర్ధమైందట. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో టిడిపి లేదా బిజెపిలో చేరితే నష్టమే తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశ్యంతో బాపిరాజు కూడా వైసిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

బాపిరాజు గ‌నుక వైసిపిలో చేరితే కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీకి ఊపురావటం ఖాయం. పై రెండు జిల్లాల్లో క్షత్రియ సామాజికవర్గం ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువుంది. అందులోనూ కృష్ణా జిల్లా కన్నా గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ. పోయిన ఎన్నికల్లో పై రెండు జిల్లాలోని క్షత్రియ సామాజికవర్గం పూర్తిగా జగన్ కు దూరం అవటం వల్లే దారుణంగా దెబ్బతింది. రెండు జిల్లాల్లో ఎక్క‌వ సీట్లు సాధించాలంటే బాపిరాజు లాంటి న‌తేలు పార్టీకి అవ‌స‌రం అని జ‌గ‌న్ భావిస్తున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -