ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉండబోతున్నాయో చెప్పాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రత్యేకహోదా తేలేకపోయాడన్న అపవాదు ప్రజల్లో బలంగా ఉంది. ఈ ఒక్క రీజన్ తో ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. కాబట్టి చంద్రబాబుకు.. ఈ అంశంపై వచ్చే ఎన్నికల్లో పెద్ద తలనొప్పి మారే అవకాశం కనిపిస్తోంది. ఇక వైసీపీ ఇప్పటి వరకు నెమ్మదిగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం స్పీడుగా దూసుకెళ్తోంది. మామూలుగా కాదు ఊహించని పథకాలతో రెండేళ్లముందుగానే మినీ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా,పాదయాత్ర చేసేందుకు రంగం రెడీ చేసుకుంటుంది. దీంతో ఏపీ ప్రజలు వైఎస్ జగన్ పై ఆసక్తిగా ఉన్నారు. పాదయాత్ర అనంతరం ఏదైనా జరగొచ్చని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓ వెలుగు వెలిగిన మహామహులంతా.. వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నెల్లురూ జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితోపాటు కడప జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిలు వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరు వైసీపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు మాజీ కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు జగన్ సైతం అంగీకరించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరితో పాటు.. గతంలో కాంగ్రెస్ పార్టీని ఓ ఊపు ఊపిన నేతలందరినీ వైసీపీలో చేరేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్కెచ్ వేసినట్లుగా సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను వివిధ పార్టీల నేతలకు వైసిపీ కండవా కప్పటమే లక్ష్యంగా పని చేస్తోంది ప్రశాంత్ టీమ్. సో అప్పుడు జగన్ అవసరం లేదని దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తిరిగి జగనే పెద్ద దిక్కుగా మారబోతున్నాడన్న మాట.
- Advertisement -
వైసీపీలో చేరబోతున్న మాజీ మంత్రులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -