Saturday, May 18, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..

- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్ఫూర్తితో రాజీనామా చేశానని ప్రకటించన రేవంత్‌.. ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. నివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు.టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న పొన్నం ప్రభాకర్‌ కూడా ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ ఏఐసీసీ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్య‌క్షుడిగా మీరె ఉండాలంటూ సీనియ‌ర్ నేత‌లు వారించినా రాహుల్ స‌సేమిరా అంటున్నారు.

అయితే రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. పార్టీ పరాజయానికి పదవుల్లో వున్న పెద్దలంతా సమష్టి బాధ్యత తీసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -