Saturday, May 10, 2025
- Advertisement -

పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పోరాటం

- Advertisement -

ఏపీలో మొన్నటివరకూ టీడీపీ వైఎస్ఆర్ సీపీ మధ్యే ప్రధాన పోరు అన్నట్టుగా రాజకీయాలు నడిచాయి. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలు మారిపోతున్నాయి. నువ్వా నేనా ? అన్నచోటే…చతుర్ముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేశారో ? ఆ క్షణం నుంచే బీజేపీపై, నరేంద్రమోడీపై దండయాత్ర మొదలు పెట్టారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా నరేంద్రమోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అన్ని పార్టీలతో చర్చలు జరుపుతూ, యాంటీ మోడీ గ్రూప్ ను బలపరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని కాకూడదనే ఏకైక లక్ష్యంతో బాబు పావులు కదుపుతున్నారు. అదే క్రమంలో ఏపీలో బీజేపీతో అంటకాగుతున్న వైఎస్ఆర్ సీపీని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ మళ్లీ బలపడాలని భావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి వెళ్లిపోకుండా, ఆ ఓట్లలో చీలిక వస్తే, ఆటోమేటిక్ గా మళ్లీ తామే అధికారంలోకి రావచ్చనేది బాబు ఆలోచన. వైఎస్ఆర్ సీపీలో ఉన్నవారిలో 90 శాతం మంది ఒకనాటి కాంగ్రెస్ శ్రేణులే. వారిని మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిస్తే వైఎస్ఆర్ సీపీ బలం తగ్గిపోతుంది. అందుకే ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు తాను రహస్యంగా సహకరిస్తానని చంద్రాబాబు ఇప్పటికే సోనియా, రాహుల్ సహా ఆ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపేశారు. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండటానికి కూడా చంద్రబాబు నాడు అందించిన సహకారమే కారణం. అవిశ్వాస తీర్మానం పెట్టాలని నాడు జగన్ తల్లకిందులుగా తపస్సు చేసి డిమాండ్ చేసినా చంద్రబాబు కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. దీంతో అప్పటి నుంచే సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దలకు చంద్రబాబు విశ్వసనీయమిత్రుడైపోయాడు.

ఇప్పుడు ఏపీలో బీజేపీ వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి, తనపై పోరాటానికి కాలు దువ్వుతున్నందున తనకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు చాలా అవసరం అని చంద్రబాబు గ్రహించారు. పైగా ఏపీలో వైఎస్ఆర్ సీపీలో ఉన్న ఆ నాటి కాంగ్రెస్ శ్రేణులను మళ్లీ హస్తం గూటికి చేరిస్తే ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ సీపీ బలహీన పడుతుందని అంచనా వేశారు. అందుకే మళ్లీ పాత నాయకులను ఏకం చేయాలని, ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ బలపడాలని బాబు బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఏపీకి ప్రత్యేకహోదాపైనే తమ తొలి సంతకం ఉంటుందని కర్నూలు సభలో రాహుల్ గాంధీ ప్రకటించారు. హోదాపై మోసం చేసిన మోడిని జగన్ పల్లెత్తు మాట అనడం లేదని జనం మండిపడుతున్నారు. ఈ నేఫథ్యంలో తాము అధికారం చేపట్టిన వెంటనే హోదా బాకీ తీర్చేస్తాం. అది ఏపీ హక్కు, మోడీలా నేను మోసం చేయను, హోదా ఇచ్చాకే మళ్లీ ఏపీలో అడుగుపెడతాను అని రాహుల్ స్పష్టంగా తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు అలా ఇంతవరకూ చెప్పడం లేదు. పైగా హోదా లేదు గీదా లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ పాయింట్ పట్టుకుని చంద్రబాబు బీజేపీని తిట్టి పోస్తున్నారు. హోదా ఇవ్వకుండా మోసం చేశారని మోడీని ఎండగడుతున్నారు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్ తో జట్టు కట్టబోతున్నాం అని రేపు బహిరంగంగా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేకహోదా సాధన కోసం కాంగ్రెస్ తో జత కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తారు కూడా. దీంతో మళ్లీ కాంగ్రెస్ కు ఏపీలో మైలేజ్ వస్తుంది. చెప్పుకోదక్ సీట్లు గెలవకపోయినా గెలుపుని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కర్నూలులోని రాహుల్ గాంధీ బహిరంగ సభే అందుకు నిదర్శనం. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏదైనా సక్సెస్ అయిందా ? అంటే ఆ సభనే సమాధానంగా చూపించవచ్చు. కాంగ్రెస్ మాజీ సీఎంలు, మాజీ కేంద్రమంత్రులు, మాజీ రాష్ట్రమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అనేకమంది మళ్లీ కర్నూలు సభ సక్కెస్ తర్వాత పార్టీ బలోపేతంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. వీలైనంత ఎక్కువమందిని ఆకర్షించి, పార్టీలో చేర్చుకోవాలని బాబు వారికి సలహాలు కూడా ఇస్తున్నారు. రాహుల్ స్పీచ్ కూడా చాలా పరిణితి కూడిన నేత స్పీచుగా ప్రజలన మన్ననలు అందుకుంది. కాంగ్రెసే శ్రేణులు ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ అసంతృప్తులను, జగన్ పోకడతో విసిగిపోయిన వారిని మళ్లీ కాంగ్రెస్ అక్కున చేర్చుకుని వచ్చే ఎన్నికల బరిలో దిగనుంది. సో సారి కాంగ్రెస్ బలోపేతం చంద్రబాబుకు అవసరం. తన అవసరాల కోసం బాబు దేనికైనా రెడీ అన్నది ప్రత్యేకంగా చెప్పాలా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -