Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్‌కంటే ఆ నాయకుడే చాలా బెటర్…… బాబు బిస్కెట్‌కి పడకుండా నిజాలు మాట్లాడాడు

- Advertisement -

ప్రపంచానికి పాఠాలు చెప్పా……. దేశంలోనే అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పి ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించి గద్దెనెక్కాడు చంద్రబాబు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చూపించిన హీరోయిజం సినిమా అంతా ఇంతా కాదు. నన్ను మించిన తోపు లేడు…….. నేనే పెద్ద తురుంఖాన్ అని తన డబ్బా తానే కొట్టుకున్నాడు. తోడుగా తబలా వాయించడానికి పవన్‌ని కూడా తెచ్చుకున్నాడు. మరి అధికారంలోకి వచ్చాక బాబు పరిస్థితి ఏంటి? వాస్తవం ఏంటి?

ఈ విషయాలను తాజాగా సిపిఐ నేత నారాయణ చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గానే ఒక కార్యక్రమంలో ఈ సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ లీడర్‌ని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నించాడు. అయితే పవన్ పడినంత ఈజీగా ఈ సీనియర్ నాయకుడు బాబు బుట్టలో పడలేదు. నారాయణకు పూనం కౌర్‌లాంటి వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని బాబును అడుక్కోవాల్సిన అవసరం లేనట్టుగా ఉంది. అందుకే ఓటకు నోటు కేసు గురించి మాట్లాడడానికి భయపడిన పవన్‌లాగా…. ఆ అవినీతి వ్యవహారం గురించి మాట్లాడుతూ కూడా బాబుని పొగిడేసిన పవన్‌లా కాకుండా నిజాయితీగా మాట్లాడాడు.

చంద్రబాబుది బానిస బ్రతుకు అన్నాడు. బాబు ఏమాత్రం తోకాడించినా చిప్ప కూడే గతి అని నిజాలు మాట్లాడేశాడు. మోడీతో తేడా వస్తే వెంటనే జైలుకు వెళ్ళాలన్న భయం చంద్రబాబుది అని చెప్పాడు. చంద్రబాబు కేసులను తన గుప్పిట్లో పెట్టుకున్న మోడీ…..చంద్రబాబును ఒక ఆట ఆడిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు ఎలాగూ ఈ కమ్యూనిస్ట్ లీడర్‌ విమర్శలకు సమాధానం చెప్పలేడు. జన్మతః కమ్యూనిస్టుని అని చెప్పుకునే పవన్ అయినా నారాయణ విమర్శలకు సమాధానం చెప్పగలడా? లేకపోతే తనను నమ్ముకున్న హీరోయిన్స్‌కి సిఫారసులు చేయిస్తూ బాబు చేత పదవులు ఇప్పించుకుంటూ ఆంద్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తూ బ్రతికేస్తాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -