టీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని వాల్లంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది కండువా కప్పుకున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కొండా దంపతులు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీ తరుపున కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్తుల జాబితాలో కొండా సురేఖపేరు లేకపోవడంతో తిరుగుబావుట ఎగరేసిన సంగతి తెలిసిందే.
కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేముందు సీఎంను విమర్శిస్తూ ఘాటుగా లేఖ రాశారు. ఎట్టకేలకు సొంత గూటికి కొండా దంపతులు చేరుకున్నారు. వీరి కంటే ముందే డీఎస్ చేరాలని నిర్ణయించుకున్నారు. కాని ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొండా దంపుతుల చేరికతో ఆయనకు లైన్ క్లియర్ అయినట్లే. దసరా నవరాత్రుల్లో చేరికకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్నారన్న ఆరోపనలతో ఆయన్ను కేసీఆర్ దూరంగా పెట్టారు. దానికి తోడు జామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత ఆగ్రహానికి గురైన డీఎస్‌ను కేసీఆర్ ఇప్పటివరకు పలకరించలేదు.తనను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ అధినేత కేసీఆర్‌కు ఘాటు లేఖ రాసిన డీఎస్ తనకు తానే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీనుంచి సస్పెండ్ చేయండంటూ లేఖలో పేర్కొన్నారు.
తనకు తానే వెల్లి పోయో విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించారు. కొంతకాలంగా కాంగ్రెసు నేతలతో డీఎస్ చేస్తున్న మంతనాలు ఫలించాయి. డీఎస్‌కు కాంగ్రెసులో చేరడం మినహా మరో మార్గం లేదు. దశాబ్దాల తరబడి కాంగ్రెసులో గడిపిన తనను పార్టీ అక్కున చేర్చుకుంటుందనే ఆయన నమ్మకం ఫలించింది.
ఇన్ని రోజులు డీఎస్ చేరకపోవడానికి ప్రధానం కారణం..కాంగ్రెసుకు ద్రోహంచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లి, మళ్లీ చేరతామనే వారిని, ఇతర పార్టీల్లో నుంచి నేరుగా వచ్చి చేరతామనేవారిని వెంటనే చేర్చుకోకూడదని అధిష్టానం నిర్ణయించడమే. కాని కొండాసురేఖ దంపతులను చేర్చుకున్నారు. ఇప్పుడు డీఎస్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల సమయంలో ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే కుదరదని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.