Saturday, May 10, 2025
- Advertisement -

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా

- Advertisement -

దేశవ్యాప్తంగా క‌రోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల మంది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఏకంగా నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. ఇక క‌రోనాబారిన పడుతున్న వాళ్ల‌లో సామాన్యులే కాదు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉంటున్నారు.

తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనాబారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. రోనా లక్షణాలు కనిపించిన వెంటనే తాను ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని చెప్పారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ఢిల్లీలోని పరిస్థితులను తాను తన నివాసం నుంచే సమీక్షిస్తానని తెలిపారు. గత కొన్ని రోజులుగా అనిల్ బైజాల్ ఢిల్లీలోని కరోనా పరిస్థితిపై పలు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. బైజాల్ కరోనా బారిన పడటంతో కేజ్రీవాల్ స్పందిస్తూ… ‘మీకు మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను సార్’ అని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -