Sunday, May 4, 2025
- Advertisement -

మేయర్ విజయలక్ష్మికి ఫ్లెక్సీ షాక్..!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్​గా ఎన్నికైన విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ జంట నగరాల్లో పెట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. జూబ్లీహిల్స్​లో అనధికారికంగా ఫ్లెక్లీ ఏర్పాటు చేశారని… తెరాస నాయకులు అతిష్ అగర్వాల్​కు రూ. లక్ష రూపాయలను ఈవీడీఎం అధికారులు జరిమానా విధించారు. మిగతా చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం జీహెచ్ఎంసీ, ఈవీడీఎం సిబ్బంది తొలగిస్తున్నారు.

అయితే అనధికారికంగా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నెటిజన్లు ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్​లో పెట్టారు. ఇది చూసిన జీహెచ్ఎంసీ, ఈవీడీఎం అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు.

గతంలో ఇలాంటి ఫ్లేక్సీలు ఏర్పాడు చేసినందుకు గాను భారీ జరిమానాలు విధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ ఫ్లెక్సీలు పెట్టకూడదని మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

దుమ్మురేపుతున్న ‘ఉప్పెన’ఫస్ట్ డే కలెక్షన్లు!

అంచ‌నాలను పెంచుతున్న పుష్ప‌!

నేనే నిర్మాత అయితే ‘ఉప్పెన’చేసేవాడిని కాదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -