- Advertisement -
వైసీపీ పార్టీకి రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అనుచరుడు ఒకరు వైసీపీ పార్టీలోకి చేరుతున్నట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు.
ఈయన ఇప్పటికే పార్టీ మారడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇతను చేరికను వైసీపీ స్వాగతిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.