- Advertisement -
వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. టీడీపీనుంచి అనేక మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇరవై ఏళ్ల సుదీర్ఘ కాలంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వీరభద్రరావు రెండుసార్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. 2014లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వచ్చారు.