సీఎం చంద్రబాబును గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద ముస్తఫా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. టీడీపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించారు ముస్తఫా.
వైసీపీకి ముస్తఫా గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. తాజాగా, రాయపాటి కారులో వెళ్లి చంద్రబాబును ముస్తఫా కలవడంతో వైసీపీని ఆయన వీడనున్నారనే వార్తలు బలపడుతున్నాయి. ఈ విషయమై ముస్తఫా స్పందిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖత చూపారని అన్నారు.
ఈ విషయం జగన్ దగ్గరకు వెల్లడంతో వెంటనే ముస్తఫా జగన్‌కు ఫోన్ చేయడంతో పార్టీమారుతన్నారనే వార్తలకు చెక్ పడింది. తానెప్పటికీ వైసిపిలోనే ఉంటానని చెప్పారు. టిడిపిలోకి రామ్మంటూ రాయపాటి గతంలోనే ఆహ్వానించినా తాను వైసిపిలోనే ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిపారు. అదే విషయాన్ని తర్వాత జగన్ కు కూడా ఎంఎల్ఏ ఫోన్ చేసి చెప్పారు. ఒకవేళ పార్టీ మారాల్సిన రోజు వస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతానే కానీ టిడిపిలో మాత్రం చేరనని తెలిపారు. గతంలో కూడా ఇలానే నేతలు మాటలు చెప్పి పార్టీని ఫిరాయించిన సంగతి తెలిసిందే.