Saturday, May 10, 2025
- Advertisement -

ఈ సారి బాల‌య్య సీటు గ‌ల్లంతెనా….

- Advertisement -

సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య‌బాబుకు సొంత నియేజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌నుంచి మ‌రో సారి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. నిమాలతో బిజీగా గడిపే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎప్పుడో గానీ అటువైపు తొంగిచూడటం లేదు. దీంతో సమస్యలతో అల్లాడుతున్న జనం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బాల‌య్య బాబుకు షాక్ ఇచ్చారు హిందూపురం ప్ర‌జ‌లు.

సినిమా షూటింగ్‌ల కారణంగా ఆరు నెలలకోసారి ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంది. కొద్ది నెలల క్రితం హిందూపురం పట్టణ ప్రజలు ఏకంగా దున్నపోతుల మీద బాలకృష్ణ పేరు రాసి ఊరేగించిన ప్ర‌జ‌లు బాల‌య్య‌ను నేరుగా నిల‌దీసి చుక్క‌లు చూపించారు. తాజాగా హిందూపురం పర్యటనకు వెళ్లిన బాలకృష్ణను పలు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు.

సోమవారం ఎమ్మెల్యే రాక సందర్భంగా సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల ప్రజలు ఆయన కారుకు అడ్డుపడ్డారు. తమ గ్రామంలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారిందని ప్రజలు బాలకృష్ణకు విన్నవించారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదని వాపోయారు. వారి విన్నపం మేరకు స్పందించిన బాలయ్య.. అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.

అనంతరం బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం, ఓబుళాపురం, బిసలమానేపల్లి ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్నారు. తమ సమస్యలు విన్నవించేందుకు ప్రయత్నించినప్పటికీ.. బాలయ్య మాత్రం వారితో మాట్లాడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బాలయ్య తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. ‘ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్.. డౌన్..’ అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు ఇక్కడి నుంచి కదిలేదని లేదని రోడ్డుపైనే బైఠాయించారు. ప్ర‌జా సమ‌స్య‌లు ప‌ట్ట‌ని బాల‌య్య వెంట‌నె రాజీనామ చేయాల‌ని డిమాండ్ చేశారు.

అధికార‌పార్టీ టీడీపీకి అనంత‌పురం జిల్లాలో హిందూపురం ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిస్క‌రించాల‌ని చాలా రోజుల‌నుంచి పోరాటం చేస్తున్నారు. వారి సమ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించ‌క‌పోతె వ‌చ్చే ఎన్నిక‌ల్లో కంచుకోట బ‌ద్ద‌ల‌య్యే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని స్థానిక ప్ర‌జ‌లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -