Friday, May 9, 2025
- Advertisement -

కేసీఆర్ క‌న్నా ఒబామా ఇష్టం… ట్విట్ట‌ర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చిట్‌చాట్‌

- Advertisement -

త‌న శాఖ‌కు త‌గ్గ‌ట్టుగానే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు వెళ్తున్నారు. సోష‌ల్ మీడియాలో కేటీఆర్ చురుగ్గా ఉంటారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన త‌న‌కు తోచిన విధంగా సాయం చేస్తుంటారు. త‌న శాఖ ప‌రిధిలోని అంశ‌మైతే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేందుకు కృషి చేస్తుంటారు. ఆ విధంగా గురువారం (డిసెంబ‌ర్ 28) ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్స్‌తో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం ఇచ్చారు. తెలిసిన వాటికి సూటిగా చెబుతూ.. ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌ను త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు. దీంతో ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ త‌న ఫాలోవ‌ర్స్‌ను ఎల్ల‌ప్పుడూ ఫాలో చేస్తుంటారు. ఈ చిట్‌చాట్‌తో కేటీఆర్ ఫాలోవ‌ర్స్ పెరిగే అవ‌కాశం ఉంది.

త‌న నాన్న కేసీఆర్ క‌న్నా త‌న‌కు అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఇష్ట‌మ‌ని, ఏపీ, తెలంగాణ‌, దేశ‌ రాజ‌కీయాలు, సినిమా ముచ్చ‌ట్లు త‌దిత‌ర ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇచ్చారు.

– సానుకూల పలితాలు సాధించే టాస్క్ మాస్టర్ సీఎం కేసీఆర్
– కేసీఆర్ కాకుండా అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఇష్టపడతా.
– మంత్రి హరీశ్ మొండి పట్టుదల ఉన్న వ్యక్తి. కష్టపడి పని చేసే నాయకుడు
– కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే.. ఆయన ఎవరు? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
– కాంగ్రెస్ అభివృద్ధికి నిరోధకమంటారు.. మరి మీ కేసీఆర్ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పని చేశారుగా? అని ప్ర‌శ్నించ‌గా అందరూ తప్పులు చేస్తారని.. తెలివైన వారు వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారని త‌న‌దైన శైలిలో బదులిచ్చారు.

– సోనియానా.. మోదీనా అనే ప్రశ్నకు సమాధానంగా.. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే లేదని, ఇరువురికి తాము సమాన దూరమని పేర్కొన్నారు.
– చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావటం లేదేం? అంటే.. ప్రభుత్వం.. ప్రజలు వేర్వేరు అనే భావన ఉంది. నిజానికి అవి రెండూ కలిస్తేనే ప్రజాస్వామ్యం.
– వచ్చే ఎన్నికల్లో విజయం మీదేనంటూ ఏపీకి చెందిన వ్యక్తి అడ‌గ్గా ఎన్నికలపై చింత లేదని.. దృష్టంతా పాలనపైనే అని తెలిపారు. ఏపీలో పార్టీని విస్తరించే ఆలోచనలేవీ తనకు తెలీదంటూ.. ఏపీని సిస్టర్ స్టేట్‌గా అభివర్ణించారు.

– ఏపీలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్.. జనసేన పార్టీల్లో ఏ పార్టీకి ఓటేస్తారని అడగ్గా.. తనకు ఏపీలో ఓటు లేదన్నారు.
– వన్ ప్లస్ వన్ ఎంతన్న ప్రశ్నకు.. రాజకీయాల్లో ఒకటికి ఒకటి రెండు ఎన్నటికి కాదన్నారు.
– ఢిల్లీ ప్రభుత్వంలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.

సినిమా వాళ్ల గురించి.. అల్లుఅర్జున్ – స్టైలిశ్‌, మహేశ్ బాబు – సూపర్ స్టార్, సచిన్ – లెజెండ్, ప్రభాస్ – బాహుబలి, జూనియర్ ఎన్టీఆర్ – ఒక ఫెర్మార్మర్, పవన్ కల్యాణ్ – ఎనిగ్మా (అర్థం చేసుకోవటానికి కష్టమైన వ్యక్తి) , పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితాన్ని ప్రజలే నిర్ణయిస్తారు, బాలీవుడ్ షారుఖ్ ఖాన్ అభిమాన నటుడు
– అప్పట్లో రాహుల్ ద్రావిడ్.. ఇప్పుడు కోహ్లీ.. రోహిత్ ఇష్టమైన క్రికెట్ తారలు
– ఇండియన్.. చైనీస్ ఫుడ్ చాలా ఇష్టం
– ఫిట్ గా ఉండటమే కొత్త సంవత్సరం రిజల్యూషన్
– మెట్రో.. జీఈఎస్ ఒకే రోజు జరగటం ఈ ఏడాది గుర్తుండిపోయే రోజు
– జీఈఎస్ స‌ద‌స్సులో జరిగిన చర్చ సందర్భంగా నెర్వస్ గా ఫీలయ్యా
– కొత్త సంవత్సరం వేడుకులకు డీజే అనుమతి ఇప్పించరా? అంటే.. నీకో దండం బాబూ అనేశారు
– రక్షణ రంగం అధీనంలోని భూసేకరణ కష్టం కావటం వల్లే స్కైవేల నిర్మాణం లేట్
– డీజిల్.. సీఎన్జీ.. ఎల్పీజీ బస్సులు కాదు.. ఎలక్ట్రికల్ వాహనాలే సరైన పరిష్కారం
– హైదరాబాద్ లో వైఫై ప్రాజెక్టు పూర్తి కావొస్తోంది. త్వరలోనే మరిన్ని హాట్ స్పాట్లు
– అమెరికాలో ఉన్నప్పుడు వంట కూడా చేశా
– మణికొండ రోడ్డును బాగు చేయాలని సినీనటుడు వెన్నెల కిషోర్ ప్రశ్నకు ష్యూర్.. తప్పకుండా అని బదులిచ్చారు.
– నాకెప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడగ్గా.. త్వరలోనే అని బదులిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -