చివరి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చిప్పే మిగులుతుందని తన కేంద్ర కేబినెట్ మినిస్టర్స్ ద్వారా ముందే తెలిసినప్పటికీ కిక్కురుమనకుండా ఉన్నాడు చంద్రబాబు. తీరా బడ్జెట్ ప్రవేశ పెట్టాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఆగ్రహంతో ఊగిపోవడంతో….ఆ ఆగ్రహంలో తాను కొట్టుకుపోకుండా ఉండడం కోసం తన మీడియా ద్వారా లీకేజ్ పోరాటం నాటకాన్ని నడిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ షరామామూలుగానే పూర్తిగా సైలెంట్ అయ్యాడు. ఇక పవన్ కూడా జేఏసీ స్థాపించి పోరాటం చేస్తా అని భారీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ వెంటనే అధ్యయనం చేస్తా అని కుంటిసాకు వెతుక్కుని సైలెంట్ అయ్యాడు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నది, స్పష్టమైన పోరాట పంథాను ప్రకటిస్తున్నది వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఒక్కడే. అయితే హోదా పోరాటం క్రెడిట్ జగన్‌కి దక్కకుండా చేయడం కోసం చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాడు. పవన్‌తో సహా జెపి, చలసానిలాంటి తన భజన బృందం, భజన మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలు జగన్ హోదా పోరుకు సహకరించుకుండా చేస్తూ…..హోదా పోరు మైలేజ్ కూడా జగన్‌కి రాకుండా చేసే ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేస్తున్నాడు. 2014లో కూడా సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన జగన్‌పై తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కారణమయ్యాడు అని బాబు బ్యాచ్ అంతా కూడా విషప్రచారం చేసింది. కొంతమంది ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మేలా కూడా చేసింది. మరి ఇప్పుడు హోదా పోరు విషయంలో కూడా ప్రజలు బాబు, పవన్‌లను నమ్ముతున్నారా? జగన్‌ని నమ్ముతున్నారా?
ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడు తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకునే చంద్రబాబు ఈ సారి కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిజల్ట్స్ మాత్రం బాబుకు దిమ్మతిరిగే రేంజ్‌లో వచ్చాయట. ప్రత్యేక హోదా పోరాటం విషయంలో చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు నమ్మడం లేదు. పైగా హోదా రాకపోవడానికి మోడీ కారణం అని చెప్పినవాళ్ళకంటే….చంద్రబాబే ప్యాకేజ్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డాడని చెప్పినవాళ్ళే ఎక్కువట. పవన్ కళ్యాణ్‌పై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి స్పష్టత ఉందని ఈ రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి. సమైక్యాంధ్ర హీరో, ఆరడుగుల బుల్లెట్ అంటూ అప్పట్లో కుమ్మక్కయి రాజకీయాలు నడిపిన చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలు తెరపైకి తెచ్చిన అశోక్ బాబు చేసిన పనినే పవన్ కూడా చేస్తున్నాడట. సమైక్యాంధ్ర పోరాటం క్రెడిట్ జగన్‌కి రాకుండా చేయడం మినహా అశోక్ బాబు చేసింది ఏమీ లేదని….ఇప్పుడు పవన్ కూడా ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ జగన్‌కి రాకుండా చేయడం మినహా చేస్తోంది ఏమీ లేదని ప్రజలు చెప్తున్నారు. అసలు వైఎస్ జగన్ లేకపోతే బాబు, పవన్‌లు కనీసం ప్రత్యేక హోదా పేరు కూడా ఎత్తరని చాలా మంది ప్రజలు కుండబద్ధలు కొట్టేశారట. ఈ మధ్య కాలంలో కాస్త ప్రత్యేక హోదా గురించి కూడా రెండు మాటలు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కారణమని తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బాబు నాటకాలు ఆడుతున్నారని ప్రజలకు పూర్తి స్పష్టత ఉన్న నేపథ్యంలో ఇకపై ఈ విషయం గురించి అస్సలు ప్రస్తావించకుండా ఉంటేనే బెటర్ అని బాబు నమ్ముతున్నాడట. అయితే పవన్ చేత మాత్రం ఏదో ఒక హంగామా కార్యక్రమం చేయించి జగన్‌కి మైలేజ్ రాకుండా చేసే ప్రయత్నాల్లో బాబు బ్యాచ్ ఉందని తెలుస్తోంది.