Saturday, May 10, 2025
- Advertisement -

చంద్రబాబు..సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీకి ఉపద్రవం ముంచిఉందా? ఇక ఏపీని అభివృద్ధి చేసేది చంద్రబాబేనా..?అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది…?చంద్రబాబే సర్వస్వమని ప్రచారం చేస్తుంది ఎవరు..?వీటన్నింటి వెనుక ఎవరు ఉన్నారు..? అంటే టీడీపీ నేతలే అనే చెప్పాల్సిన పనిలేదు.

ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎప్పటినుండో ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని సీఐడీ నిగ్గుతేల్చింది. సాక్ష్యాధారలతో సహా టీడీపీ హయాంలో చంద్రబాబు అనుమతితో జరిగిన అవినీతి బట్టబయలు చేసింది. డబ్బులు హవాలా రూపంలో విదేశాలకు ఎలా వెళ్లాయి..అక్కడి నుండి దేశానికి ఎలా వచ్చాయి అనేది పక్కా ఆధారాలతో నిరూపించి కోర్టుకు సమర్పించింది. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని కళ్ల ముందు కనబడుతుంది. అయితే నిజం చెప్పులు తొడు్కునే లోపు.. అబద్దం ప్రపంచాన్ని చుట్టివస్తుందనే నానుడిని..కానీ చంద్రబాబు విషయంలో ఇది రివర్స్‌గా జరుగుతుంది. అదే చంద్రబాబు స్కిల్స్‌. అందుకే బాబు అవినీతిని కప్పిపుచ్చి ఆయనేదో సత్యహరిశ్చంద్రుడనే లెవల్లో సోషల్ మీడియాలో ప్రోజెక్ట్ చేస్తున్నారు.

ఇక బాబు అరెస్ట్ తో సోషల్ మీడియాలో బాబుకు మద్దతుగా పెయిడ్ ప్రచారాన్ని మరింత రెట్టింపుచేశారు. ఆంధ్రోడా మేలుకో ఆంధ్రాని కాపాడుకో అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగోడి ఆత్మగౌరవం అంటూ నానా యాగి చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేసే వారిని చూసి ప్రజలు జాలి పడుతున్నారు. టీడీపీ ఆవిర్భవించిందే తెలుగోడి ఆత్మగౌరవం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ చంద్రబాబు అధికారం కోసం కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకునేందుకు వెనుకాడలేదు. దీనినే పెయిడ్ క్యాంపెయిన్ చేసేవారిని టార్గెట్ చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఇందులో తప్పేముందని తూర్పారబడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -