తెలంగాణలో మహా కూటమికి బీటలు వచ్చే అవకాశం ఉందా. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. కాంగ్రెస్ తీరుపై సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడినన్ని సీట్లు ఇవ్వక పోతే కూటమి నుంచి బయటకు పోతామని నేతలు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది.తాము కోరుతున్న స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తుండడంపై సీపీఐ నేతలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు అసెంబ్లీ, ఒక్క ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది. మిత్రపక్షాలకు 26 స్థానాలను కేటాయించనుంది. సీపీఐకి3, టీజేఎస్‌కు 8, టీడీపీకి 14 స్థానాలను కేటాయించింది. అయితే మూడు సేట్లే కేటాయంచడంపై సీపీఐ గుర్రుగా ఉంది. కనీసం ఐదు స్థానాలనైనా కేటాయిస్తారని భావించినట్లు సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి తెలిపారు.
సీపీఐ పార్టీకి హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే.. తమకు బలమున్న కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం జరిగే పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.