Thursday, May 8, 2025
- Advertisement -

ఇసుక తుపాను..బాబును గట్టెక్కిస్తుందా?

- Advertisement -

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఇసుక దందా చుట్టే తిరుగుతున్నాయి. జగన్ సర్కార్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు నారా లోకేష్ తన యువ గళం పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పందికొక్కుల్లా జగన్ సర్కార్‌ను ఇసుకను మాయం చేస్తుందని మండిపడుతున్నారు. అయితే జగన్‌ను టార్గెట్ చేసేందుకు లోకేష్ టీం ఎంచుకున్న ఇసుక మాఫియా టీడీపీని గట్టెక్కిస్తుందా అంటే కష్టమేనని చెప్పాలి.

ఎందుకంటే ఇసుక మాఫియాపై విమర్శలు ఎక్కుపెట్టడం వరకు బాగానే ఉన్నా టీడీపీ నేతల మాటల్లోనే తేడా ఉంది. ఎందుకంటే ఇసుక దందాపై ఒక్కో నేతది ఒక్కో మాట.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మాట చెబితే లోకేష్ మరో మాట చెబుతు ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు.

ఇసుక పేరు చెప్పి రోజుకు మూడు కోట్ల రూపాయలు జగన్ తినేస్తున్నాడంటూ నారా లోకేష్ అంటుండగా చంద్రబాబు మాత్రం ఏకంగా జగన్ 40 వేల కోట్ల రూపాయలు స్వాహా చేశాడని ఆరోపించారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. లోకేష్ ప్రకారం రోజుకు 3 కోట్లు అంటే ఏడాదికి రూ.1095 కోట్లు..నాలుగు సంవత్సరాలకు రూ.4380 కోట్లు. ఇక చంద్రబాబు 40 వేల కోట్లు అని చెప్పగా వీరిద్దరి మధ్య వ్యత్యాసం 35 వేల కోట్లకు పైనే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైనా ఆరోపణ చేసేందుకు నిర్దిష్టంగా పరిశీలించి ఆరోపణలు చేయాలే కానీ నోటికొచ్చినట్లు మాట్లాడుతామంటే ప్రజల్లో చులకన అవుతారని లోకేష్ బాబుకు సూచిస్తున్నారు.

అయినా ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలంటే ఏఏ రంగంలో జగన్ సర్కార్ విఫలమయ్యారో అవగాహన తెచ్చుకొని వాటిని ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలి. కానీ ఒకే అంశాన్ని పదేపదే ప్రస్తావించడం వల్ల జగన్ సర్కార్‌ని ఇబ్బందులు పెట్టడం సంగతి పక్కన పెడితే ఇది వైసీపీకి మరింత ప్లస్ చేసిన వాళ్లు అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -